నవగ్రహాలు

ఈ కలియుగంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మనుషులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి. నవగ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని - అశుభాన్ని రెండిటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి వుంటుంది.

మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం. ఆయా గ్రహమంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. వీటి ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు.

ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బైటపడవచ్చు. ప్రాణాపాయ స్థితి నుంచి ఏదో ఒక చిన్నగాయంతో తప్పించుకోవచ్చు.

ఎందుకంటే చేసిన కర్మ ఎవరైనా అనుభవించి తీరాల్సిందే కనుక. నవగ్రహాలు సంతృప్తి చెంది మనుషులకి సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి.

error: Content is protected !!