అష్ట దిక్పాలకులు

ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ. మరి దిక్కులు 4 అయితే అష్ట దిక్పాలకులు అనే పదం ఎలా వచ్చింది? అంటే మిగిలిన 4 మూలలు కూడా కలిపి ఆ పదం వచ్చింది. ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు.

1.ఇంద్రుడు - తూర్పు దిక్కు ఇతని భార్య పేరు శచీదేవి, పట్టణం అమరావతి, వాహనం ఐరావతం, ఆయుధం వజ్రాయుధం.

2.అగ్ని - ఆగ్నేయ మూల ఇతని భార్య పేరు స్వాహాదేవి, పట్టణం తేజోవతి, వాహనం పొట్టేలు, ఆయుధం శక్తిఆయుధం.

3.యముడు - దక్షిణ దిక్కు ఇతని భార్య పేరు శ్యామలాదేవి, పట్టణం సంయమిని, వాహనం మహిషం, ఆయుధం పాశం

4.నైరుతి - నైరుతి మూల ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, పట్టణం కృష్ణాంగన, వాహనం గుర్రం, ఆయుధం ఈటె.

5.వరుణుడు - పడమర దిక్కు ఇతని భార్య పేరు కాళికా దేవి, పట్టణం శ్రద్ధావతి, వాహనం మొసలి, ఆయుధం దండం.

6.వాయువు - వాయువ్య మూల ఇతని భార్య పేరు అంజనాదేవి, పట్టణం నంధవతి, వాహనం లేడి, ఆయుధం ధ్వజము కుబేరుడు - ఉత్తర దిక్కు

7.ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, పట్టణం అలక, వాహనం నరుడు, ఆయుధం ఖడ్గం.

8.ఈశాన్యుడు - ఈశాన్య మూల ఇతని భార్య పేరు పార్వతీ దేవి, పట్టణం యశోవతి, వాహనం వృషభం, ఆయుధం త్రిశూలం

error: Content is protected !!